కొడుకుతో రోజా డాన్స్.. వీడియో వైరల్!
on Jul 1, 2021
సీనియర్ నటి రోజా ఓ పక్క రాజకీయాలు, మరోపక్క షూటింగ్స్ తో చాలా బిజీగా ఉంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా.. ఆమె తన కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని వాళ్ల కోసం ఇచ్చేస్తారు. కుటుంబంలో జరిగే ప్రతి వేడుకకు రోజా హాజరవుతుంటారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి షికార్లకు వెళ్తుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.
ఇక జూన్ 27న రోజా తన కొడుకు కౌశిక్ పుట్టినరోజుని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. హార్స్‌లీ హిల్స్ లో ఈ వేడుక జరిగింది. భర్త సెల్వమణి, కూతురుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అలానే కొడుకుతో కలిసి రోజా డాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో 'ప్రేమికుడు' సినిమాలోని 'ఊర్వశి' పాటకు కొడుకుతో కాలు కదిపారు రోజా. పాటకు తగ్గట్లుగా సింపుల్ స్టెప్పులతో డాన్స్ బాగా చేశారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన రోజా ఆ మాత్రం డాన్స్ చేయాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)